- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Arjun Rampal: మళ్లీ కలుద్దాం.. పెద్దన్నయ్య!
దిశ, వెబ్ డెస్క్: నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న భగవత్ కేసరి సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో బాలయ్యకు పత్రినాయకుడిగా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ నటిస్తున్నారు. అయితే అర్జున్ రామ్‌పాల్ పాత్రకు సంబంధించిన షెడ్యూల్ పూర్తి అయింది. దీంతో ‘భగవత్ కేసరి’ సినిమా యూనిట్’కు గుడ్ బై చెప్పారు. మళ్లీ సినిమాలో కలుద్దాం అంటూ బాలయ్య, దర్శకుడు అనిల్ రావిపూడితో దిగిన ఫొటోలను ట్వీట్ చేశారు. షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ తనకు చాలా సహకరించిందని తెలిపారు. ‘భగవత్ కేసరి’ సినిమా తనదని చెప్పారు. ఈ సినిమా చాలా నేర్పిందన్నారు. తాను తెలుగులో నటించడం తొలిసారి అని.. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా భయమేసిందని వెల్లడించారు. కానీ చిత్రీకరణ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిందని పేర్కొన్నారు.
పెద్దన్నయ్య బాలకృష్ణ సహకారం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదని అర్జున్ రాంపాల్ చెప్పారు. అలాగే షూటింగ్ సమయంలో బాలయ్య చూపిన ప్రేమ నుంచి చాలా నేర్చుకున్నానని అర్జున్ రాంపాల్ వ్యక్తం చేశారు. తమ్ముడు అనిల్ రావిపూడి చాలా క్రేజీ, ప్రశాంతం, సూపర్ ట్యాలెంట్ ఉన్న వ్యక్తి అని అర్జున్ రాంపాల్ తెలిపారు. యంగ్ నిర్మాత సాహు వల్లే చాలా ఈజీగా షూటింగ్ చేయగలిగానని ఆయన చెప్పారు. భగవత్ కేసరి సినిమా అక్టోబర్ 19 విడుదల అవుతుందని.. కచ్చితంగా హిట్ అవుతుందని అర్జున్ రాంపాల్ పేర్కొన్నారు.
It’s a wrap for me on my film #bhagwantkesari I was so nervous when I came here to shoot my first Telugu film. I can confidently say now have had an absolute blast filming it. All this would not have been possible without the energy of my big brother #balakrishna thank you bro… pic.twitter.com/urHmQeQ070
— arjun rampal (@rampalarjun) August 14, 2023