ఇక కనిపించనని మహేశ్ బాబుకు ప్రామిస్ చేసిన నమ్రత.. అందుకే గౌతమ్..!

by Anjali |   ( Updated:2023-10-15 11:08:10.0  )
ఇక కనిపించనని మహేశ్ బాబుకు ప్రామిస్ చేసిన నమ్రత.. అందుకే గౌతమ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నమ్రత ముంబైలో పుట్టి పెరిగినా ఒక హీరోయిన్ తెలుగింటి కోడలు కావడం.. అలాగే ఇక్కడి పద్ధతులను అనుగుణంగా నడుచుకోవడం గొప్ప విషయం. పైగా మహేష్ - నమ్రత ప్రేమ చేసుకున్నారు. పరిశ్రమలోని వారు లవ్ మ్యారేజేస్ చేసుకున్న వాళ్లు ఏడాది రెండేళ్లు కాపురం చేసి మనస్పర్థాల కారణంగా డివోర్స్ వరకు వెళ్తున్నారు. అలాంటిది వీరి జంటను చూసి అందరూ ఇప్పుటికి బెస్ట్ కపుల్ అని చెప్పుకుంటారు.

అయితే, మహేష్.. నమ్రతను వివాహం చేసుకునే ముందే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదని కండిషన్ పెట్టారట. ఇక తను మహేష్‌పై ప్రేమతో నమ్రత ఓకే అని చెప్పిందట. కాగా, నమ్రత మళ్లీ ఎక్కడ మనసు మార్చుకుంటుందోనని వరుసగా అవకాశాలు వస్తున్న సమయంలో ఆమె రూల్స్‌ను బ్రేక్ చేస్తుందో అన్న భయంతో గౌతమ్‌ను త్వరగా కనడానికి మహేష్ ప్లాన్ చేసుకున్నాడట. ఒక బిడ్డ పుట్టాక హీరోయిన్‌గా చేయాలన్న ఆలోచన రాదని.. అలాగే వారి మధ్య లవ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని ఇలా చేశాడట. అలాగే ఇక సినీ పరిశ్రమలో ఎప్పుడు కనిపించకూడదని కూడా నమ్రత ప్రామిస్ చేసిందట. ఇది ఎంత వరకు వాస్తవమో కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story