Nagashaurya: నాగశౌర్య కొత్త సినిమా స్టార్ట్.. ఫొటోలు వైరల్

by sudharani |
Nagashaurya: నాగశౌర్య కొత్త సినిమా స్టార్ట్.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: హీరో నాగ శౌర్య తన కొత్త సినిమాను ప్రకటించాడు. శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై న్యూకమ్మర్ శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డెబ్యుటెంట్ రామ్ దేశిన (రమేష్) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది శౌర్య సినీ కెరీర్‌లోనే హై-బడ్జెట్ ప్రాజెక్ట్‌గా వుండబోతోంది. యూనివర్సల్ అప్పీల్‌ ఉన్న కథ, బిగ్ హిట్‌తో పాటు శౌర్యకు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కాబోతున్నట్లు తెలుస్తుండగా.. ఈ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు స్టార్ట్ అయింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రంలో సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్‌లతో సహా ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక దీనిపై మిగిలిన అప్‌డేట్స్ రావాల్సి ఉంది.

Advertisement

Next Story