Sobhita Dhulipala: శోభితకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వబోతున్న అక్కినేని ఫ్యామిలీ.. దాని ధర ఎంతో తెలిస్తే షాక్?

by Hamsa |   ( Updated:2024-12-01 16:28:06.0  )
Sobhita Dhulipala: శోభితకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వబోతున్న అక్కినేని ఫ్యామిలీ.. దాని ధర ఎంతో తెలిస్తే షాక్?
X

దిశ, సినిమా: అక్కినేని ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita Dhulipala) మంగళ స్నానం కూడా ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి పెళ్లి పనులు మొదలైయ్యాయి. అయితే గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న వారు పెద్దల అంగీకారంతో డిసెంబర్ 4న వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో.. సోషల్ మీడియాలో చైతు, శోభితలకు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. తాజాగా, అక్కినేని ఫ్యామిలీ కాబోయే కోడలికి ఇవ్వబోతున్న బహుమతులు ఇవేనంటూ చర్చ జరుగుతోంది.

అయితే రీసెంట్‌గా నాగార్జున(Nagarjuna) రూ. 2 కోట్లు పెట్టి కొన్న లెక్సెస్ కారు(Lexus car)ను గిఫ్ట్‌గా శోభితకు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే పెళ్లి(Wedding)కి ముందు కొనుగోలు చేశారని అంతా అనుకుంటున్నారు. కారుతో పాటు విలువైన బంగారు ఆభరణాన్ని కూడా అక్కినేని ఫ్యామిలీ శోభితకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Read More...

Sobhita Dhulipala: హల్దీ ఫొటోలు షేర్ చేసిన శోభిత.. చైతు మాయలో పడకు బాధ పడతావంటున్న నెటిజన్లు


Advertisement

Next Story

Most Viewed