చిరు కోసం వెనక్కి తగ్గిన నాగార్జున.. ఎందుకో తెలుసా?

by Hajipasha |   ( Updated:2022-09-13 08:48:49.0  )
చిరు కోసం వెనక్కి తగ్గిన నాగార్జున.. ఎందుకో తెలుసా?
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఒక హీరో సినిమాతో మరొక హీరో సినిమా పోటీ పడటం ఎప్పటి నుంచో ఉంది. నిజానికి పోటీ ఉంటేనే మజా వస్తుందనేది పలువురి అభిప్రాయం. ఈ సంగతి పక్కనబెడితే చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రంతో పాటు నాగార్జున 'ది ఘోస్ట్' మూవీ ఒకే రోజున బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టబోతుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక సర్‌ప్రైజ్ న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. 'ది ఘోస్ట్' మూవీ అక్టోబర్ 5న కాకుండా 7వ తేదీన ప్రేక్షకులు ముందుకు వచ్చేలా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

కానీ, నాగార్జున మూవీ టీమ్ ముందుగానే పక్కా డేట్‌ను ప్రకటించగా.. ఆ తర్వాత 'గాడ్ ఫాదర్' సేమ్ డేట్ ఫిక్స్ చేసింది. అలాంటప్పుడు మెగాస్టార్ రాజీపడాలి కానీ కింగ్ టీమ్ తమ ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన పూర్తి క్లారిటీ రానుండగా.. ప్రమోషన్ విషయంలో ఇప్పటికే స్లోగా ఉన్న గాడ్ ఫాదర్ టీమ్ రేపు ఆడియో సింగిల్ తాలూకు అప్‌డేట్ ఇవ్వనుంది.

Also Read : మహేష్‌తో సినిమా కథ రివీల్ చేసిన జక్కన్న.. గ్లోబల్ లెవల్‌లో ప్లాన్

ఇవి కూడా చ‌ద‌వండి : కృష్ణం రాజు చివరి క్షణల్లో పక్కనే ఉన్న స్టార్ హీరోయిన్ అనుష్క ?

Advertisement

Next Story

Most Viewed