- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగార్జున నయా మోసం.. 20 ఏళ్ల తర్వాత ఒక్క వీడియోతో అడ్డంగా దొరికిపోయిన యువ సామ్రాట్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ద్వారా నాగ్, దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. కంటెస్టెంట్లు హౌస్‌లో చేసే ఓవర్ యాక్షన్ ఆడియన్స్‌కు చికాకు తెప్పిస్తుంది. ఇకపోతే ఈ హీరో గురించి ఓ వార్త సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. నాగార్జున సినీ కెరీర్‌లో ఎవర్‌గ్రీన్ చిత్రాల్లో కె. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘మన్మథుడు’ ఒకటి. సోనాలి బింద్రే, అన్షు కథానాయికలుగా నటించిన ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాపీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే విషయానికొస్తే.. ఈ చిత్రంలో నాగ్ బ్రిడ్జ్ దాటే సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఈ హీరోకు వాటర్ అంటే భయం ఉండటంతో సోనాలి కళ్లల్లోకి చూడమని.. నాగార్జునను బ్రిడ్జ్ దాటిస్తుంది. కాగా ఈ సీన్ ఫ్రాన్స్ దేశంలో చిత్రీకరించినట్లు ప్రేక్షకులకు చూపించారు. కానీ అది అవాస్తవమట. ‘ఆ బ్రిడ్జ్ సీన్ విషయంలో ఆడియన్స్‌ను మోసం చేశారు. అసలు ఆ బ్రిడ్జ్ పారిస్‌లోనే లేదు. ఆస్ట్రియా దేశంలో ఉంది. ఈ చిత్ర దర్శక, నిర్మాతలతో పాటు నాగార్జున కూడా మనల్ని మోసం చేశాడు’’ అంటూ నెటిజన్లు మీమ్స్ రూపంలో ఓ వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన జనాలు ‘ఇది నయా మోసం నాగార్జున గారు’ అని కామెంట్ల మోత మోగిస్తున్నారు.
Read More : చైతూ మూవీ కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి.. కెరియర్లో ఇదే హయ్యెస్ట్ !