మలయాళంలో భారీ విజయాన్ని సాధించిన సినిమా రీమేక్‌లో నాగార్జున..?

by sudharani |
మలయాళంలో భారీ విజయాన్ని సాధించిన సినిమా రీమేక్‌లో నాగార్జున..?
X

దిశ, వెబ్‌డెస్క్: కింగ్ నాగార్జున ఇటీవల వచ్చిన సినిమా 'ది ఘోస్ట్'. ఈ మూవీ అంచనాలకు భిన్నంగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దీంతో నాగ్ అభిమానులు కాస్త నిరాశ చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి వచ్చే సినిమాతో భారీ హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నారట నాగ్. ఈ మేరకు మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ''పోరింజు మరియం జోస్'' అనే సినిమాను రీమేక్ చేసే పనిలో నాగార్జున ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా.. 2019లో వచ్చిన ఈ సినిమాలో జోజు జార్జ్ చేసిన రౌడీ పాత్రనే తెలుగులో నాగ్ చేయబోతున్నారట. అంతే కాకుండా ఈ చిత్రంలో అల్లరి నరేష్ కూడా ఓ కీలక పాత్ర నటించనున్నాడు. కాగా.. ఈ రీమేక్ సినిమాతో అయినా నాగ్ హిట్ కోడతారేమో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story