స్వయంగా కాల్ చేసి అడిగిన నాగార్జునకు నో చెప్పిన Rashmika Mandanna!

by Anjali |   ( Updated:2023-09-19 09:10:35.0  )
స్వయంగా కాల్ చేసి అడిగిన నాగార్జునకు నో చెప్పిన Rashmika Mandanna!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. అయితే తాజాగా రష్మిక, నాగార్జునకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. 2016లో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ మూవీ విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో కృతిశెట్టి పాత్రకు ముందు రష్మిక మందన్నను అప్రోచ్ అయ్యారట మేకర్స్. కానీ వరుస కాల్ షీట్‌లతో బిజీగా ఉన్న రష్మిక టైం కేటాయించలేకపోవడంతో కృతిశెట్టికి ఆఫర్ అందినట్లు తెలుస్తోంది. అంతేకాదు నాగార్జున స్వయంగా కాల్ చేసి అడిగిన కూడా రష్మిక నో చెప్పిందట. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నాగ్ లాంటి హీరో అడిగిన నో చెప్పినందుకు రష్మికపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story