అమల కట్నం తీసుకురమ్మంటే ఆ పని చేసింది.. నాగార్జున సంచలన కామెంట్స్?

by Anjali |   ( Updated:2023-11-24 06:08:27.0  )
అమల కట్నం తీసుకురమ్మంటే ఆ పని చేసింది.. నాగార్జున సంచలన కామెంట్స్?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున మొదటగా లక్ష్మిని వివాహం చేసుకుని పలు కారణాల వల్ల డివోర్స్ తీసుకున్నాడు. అనంతరం అమల ప్రేమలో పడి.. పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లై 30 ఏళ్లు దాటినా ఎలాంటి గొడవలు లేకుండా ఒకరికొకరు అండగా నిలుస్తూ సంతోషంగా జీవిస్తున్నారు. అయితే నాగార్జుకు ఓ ఇంటర్వ్యూలో అమల కట్నంగా ఏం తీసుకొచ్చింది అనే ప్రశ్న ఎదురైంది. ‘‘అమల మా ఇంటికి కోడలిగా అడుగు పెట్టిన సమయంలో కట్నంగా డబ్బు ఏం తీసుకురాలేదు. రెండు కుక్కపిల్లల్ని మాత్రం తనతో వెంట పెట్టుకొని వచ్చింది. అంటూ నాగార్జున ఈ విషయాన్ని మీడియాతో పంచుకుంటూ తెగ నవ్వేశాడు. నాగార్జున మాటలు విన్న అక్కడున్న వారందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story