- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nagarjuna: రజినీకాంత్‌కు విలన్‌గా నాగార్జున.. మామూలు హైప్ లేదుగా!
దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రజెంట్ వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. గతేడాది ‘జైలర్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన మరో మూవీ చేస్తున్నట్లు తెలుస్తుంది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ చేయబోతున్న చిత్రానికి ‘కూలీ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే.. ఈ మూవీపై ఓ సాలిడ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో రజినీకాంత్‌కు పోటీగా.. అంటే విలన్ క్యారెక్టర్‌లో టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున విలన్ పాత్రలో చేయనున్నట్లు కోలీవుడ్ మీడియా సర్కిల్‌లో వినిపిస్తుంది.
అంతే కాకుండా.. విలన్ పాత్ర కథ బాగా నచ్చడంతో నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచి ఉండాల్సి ఉంది. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో.. కొంత మంది చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అవుతుంటే మరికొందరు మాత్రం నాగ్ విలన్‌గా సెట్ అవుతాడా లేదా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. కాగా.. కింగ్ నాగార్జున ప్రజెంట్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కుబేర’ చిత్రంలో కీరోల్ ప్లే చేస్తున్నాడు. ఇందులో ధనుష్, రష్మిక జంటగా నటిస్తున్నారు.