వరుణ్-లావణ్య పెళ్లికి నిరాకరించిన నాగబాబు.. ఒప్పించింది ఎవరో తెలుసా?

by Anjali |   ( Updated:2023-08-13 16:23:17.0  )
వరుణ్-లావణ్య పెళ్లికి నిరాకరించిన నాగబాబు.. ఒప్పించింది ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి గుట్టు చప్పుడు కాకుండా ఐదేళ్లు రిలేషన్‌‌లో ఉండి సడన్‌గా జూన్ నెలలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ప్రస్తుతం వరుణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కాగా వచ్చే నెలలో వీరిద్దరి పెళ్లి రాజస్థాన్ లేదా వీరి ప్రేమ చిగురించిన ఇటలీలో కానుందని సమాచారం. అయితే ముందు మెగా ఫ్యామిలీ లావణ్య-వరుణ్ వివాహానికి అస్సలు ఒప్పుకోలేదట. నాగబాబుకు ఇండస్ట్రీలోని హీరోయిన్‌‌ను కోడలిగా తెచ్చుకోవడానికి అస్సలు ఇష్టం లేదట. కానీ నిహారిక పట్టుపట్టి మరీ వీరిద్దరి పెళ్లకి ఒప్పించిందట. ‘‘ఇక నిహారిక నాగబాబు గారాల పట్టి కాబట్టి.. వెంటనే నాగబాబు ఒప్పుకున్నాడు.’’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story