PAWAN KALYAN-NAGABABU: పవన్ కళ్యాణ్‌పై నాగబాబు సంచలన కామెంట్స్.. ఫ్యాన్స్ ఊహించని విధంగా తప్పించుకున్న మెగా బ్రదర్

by Anjali |
PAWAN KALYAN-NAGABABU: పవన్ కళ్యాణ్‌పై నాగబాబు సంచలన కామెంట్స్.. ఫ్యాన్స్ ఊహించని విధంగా తప్పించుకున్న మెగా బ్రదర్
X

దిశ, సినిమా: మెగా ఫ్యామిలీ అనుబంధం గురించి తెలుగు ప్రేక్షకులను స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అత్యంత తక్కువ సమయంలోనే తన నటన, డాన్స్ తో స్టార్ గుర్తింపు దక్కించుకున్నారు. అనంతరం తన బ్రదర్స్‌ను ఇండస్ట్రీకి తీసుకొచ్చి మంచి నటులుగా జనాలకు పరిచయం చేశారు. ఇప్పుడు తమ్ముడి ఆశయం మేరకు ఎల్లవేళలా మద్ధతు ప్రకటిస్తూ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం చేశాడు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక మొదటిసారిగా ఇంటికొచ్చి ముందుగా అన్న చిరంజీవి కాళ్లు మొక్కడం చూసే ఉంటారు. పవన్ విజయంతో మెగా ఫ్యామిలీ అండ్ అభిమానులంతా సంతోషంలో మునిగితేలారు.

తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా నాగబాబు తమ్ముడు పవన్ కల్యాణ్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఓ వ్యక్తి పవన్ గురించి ఒక్క మాటలో చెప్పండని అడగ్గా.. ‘కొణిదెల పవన్ కల్యాణ్’ అని ఫన్నీగా చెప్పుకొచ్చారు. పవర్ స్టార్ సినిమాల గురించి ప్రశ్నించగా.. ఆయన అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలని అన్నాడు. జనసేన పార్టీ వంద శాతం స్ట్రైక్ రేట్ నాగబాబుకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని .. ఈ ఫీలింగ్ ను నేను మాటల్లో చెప్పలేనని వెల్లడించారు. పవన్ కల్యాణ్ కేవలం రాజకీయ నాయకుడు, అగ్ర నటుడు మాత్రమే కాదు.. మంచి క్రికెటర్ కూడా అని తెలిపాడు.

పవన్ లా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం ఎవరివల్ల కాదని పేర్కొన్నాడు. తర్వాత ఓ నెటిజన్ పవర్ స్టార్ ను మీట్ అవ్వాలంటే ఎలా అని అడిగాడు. దీనికి నాగబాబు.. నేరుగా విజయవాడ దగ్గర మంగళగిరికి వెళ్లండని అన్నాడు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ ఇంటి అడ్రెస్ ఎక్కడ అని అడగండి. అక్కడికెళ్లాక ఎవరిని అడిగిన చెబుతారన్నారు. మీట్ అయి రండి అని నవ్వారు. పూర్తి అడ్రస్ చెబుతూనే నాగబాబు మరీ ఈ విషయం నేను చెప్పానని చెప్పకండి అని అన్నాడు. ఎందుకంటే తమ్ముడి దగ్గర మాటొస్తుందని ఫన్నీగా తప్పించుకున్నారు. నాగబాబు ఫ్యాన్స్‌తో ఫన్నీగా సంభాషించిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story