Nagababu : అల్లు అర్జున్‌పై నాగబాబు రియాక్షన్.. దాని కోసం వెయిటింగ్ అంటూ కామెంట్

by sudharani |
Nagababu : అల్లు అర్జున్‌పై నాగబాబు రియాక్షన్.. దాని కోసం వెయిటింగ్ అంటూ కామెంట్
X

దిశ, సినిమా: గత కొంత కాలంగా సోషల్ మీడియాలో మెగా Vs అల్లు వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ ఎలక్షన్ టైంలో ఈ వివాదం ఇంకాస్త వేడెక్కింది. 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో కష్టపడుతున్న పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చెయ్యకుండా వైసీపీ పార్టీ నేతకు అల్లు అర్జున్ తన మద్దతు ప్రకటించడంతో.. సోషల్ మీడియాలో మెగా Vs అల్లు ఫ్యామిలీగా మారిపోయాయి. అంతే కాకుండా సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్‌ను అన్ ఫాలో చెయ్యడం.. అలాగే నాగబాబు ట్వీట్ ఇవన్ని కూడా ఈ వివాదాలకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. ఈ క్రమంలోనే తాజాగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్‌పై చేసిన కామెంట్స్ ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి.

ఈ మేరకు తాజాగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించాడు. ఇందులో భాగంగా ఓ అభిమాని.. ‘అల్లు అర్జున్ సంగతి ఏంటీ బాబాయ్’ అని ప్రశ్నించాడు. దానికి నాగబాబు ‘పుష్ప 2 కోసం వెయిటింగ్’ అని చెప్పాడు. అలాగే.. అల్లు అర్జున్ గురించి ఒక్క ముక్కలో ఏం చెబుతారు అంటే.. ‘అర్జున్ హార్డ్ వర్కింగ్’ అంటూ రిప్లై ఇచ్చాడు నాగబాబు. ప్రజెంట్ నాగబాబు కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో.. మెగా Vs అల్లు వివాదాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల్లో ఎలాంటి నిజాలు లేవని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ‘పుష్ప 2 రిలీజ్ కోసం వెయిటింగ్ అన్నాడు అంటే దాని వెనుక ఇంకేదైనా అర్థం ఉందేమో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story