సమంత అక్కతో నాగచైతన్య నిశ్చితార్థం.. అసలు విషయం తెలిసి అంతా షాక్!

by Gantepaka Srikanth |
సమంత అక్కతో నాగచైతన్య నిశ్చితార్థం.. అసలు విషయం తెలిసి అంతా షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటి శోభితా దూళిపాళ్లతో అక్కినేని నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. కొద్ది మంది బంధువులు, ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల మధ్య గురువారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే ముందుగా ఎలాంటి సమాచారం లేకుండా.. ఎవరికి తెలియకండా రెండు కుటుంబాలు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. తీరా నిశ్చితార్థం రోజున అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని రివీల్ చేశారు. దీంతో అటు అక్కినేని ఫ్యాన్స్, ఇటు శోభిత ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. నాగా చైతన్యతో ఎంగేజ్‌మెంట్ అనగానే శోభిత ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌కు సంబంధించిన విషయాలపై నెట్టింట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె చెల్లిని సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.

దీనికి కారణం ఆమె పేరు సమంత కావడం. అయితే, తెనాలికి చెందిన శోభిత తండ్రి‌ నేవీ‌ అధికారి, తల్లి స్కూల్ టీచర్. శోభిత‌ 2013 ఫెమీనా మిస్ ఇండియా కిరీటాన్ని గెలిచింది. మోడలింగ్ చేస్తూ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శోభిత చెల్లెలి పేరు సమంతా ధూళిపాళ్ల. కొంత కాలం కిందట‌ ఆమె ప్రేమ పెళ్లి చేసుకుంది. దీంతో ఆమెను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. కాగా, 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్టుగా చైతన్య, సమంత ప్రకటించారు. నాగచైతన్య-సమంత విడిపోయిన నాటి నుంచే చైతూ-శోభిత ధూళిపాళ్లపై రూమర్స్‌ వచ్చాయ్‌. అప్పట్లో ఈ వార్తలను కొట్టిపారేసినా.. చివరకు వారే ఒక్కటి కావడం నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది.

Advertisement

Next Story