- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్నాళ్లకు సమంత విషయంలో నిజం ఒప్పుకున్న నాగచైతన్య.. రిలేషన్షిప్లో మోసం చేశానంటూ కామెంట్స్! (వీడియో)
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య జంటగా నటించి కొద్ది రోజులు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత విషయం పెద్దలకు చెప్పి 2017లో వీరిద్దరు ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ క్యూట్ కపుల్ కాపురం కొద్ది కాలంపాటు బాగానే సాగినప్పటికీ మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం విడివిడిగా ఉంటూ ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటున్నారు. చై, సమంతకు సంబంధించిన వార్తలు ఎన్ని వచ్చినప్పటికీ స్పందించకుండా కెరీర్లో ముందడుగు వేస్తున్నారు. అయితే వీరి ఫ్యాన్స్ మాత్రం మళ్లీ కలవాలని కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, నాగచైతన్య మోసం చేశానంటూ చేసిన కామెంట్స్ నెట్టింట కొత్త చర్చకు దారి తీశాయి. ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పిన మాటలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎప్పుడైనా రిలేషన్షిప్లో మోసం చేశారా? అని అడగ్గా.. దానికి అను లేద అని సమాధానమివ్వగా.. చైతు మాత్రం అవును అని నిజం ఒప్పుకున్నాడు. ప్రతి ఒక్కరూ జీవితంలో అన్ని అనుభవించాలి. అప్పుడే ఎదుగుతారు అని అన్నాడు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అయితే ఈ వీడియో గతంలోది. నాగచైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన శైలజా రెడ్డి అల్లుడు ప్రమోషన్స్‌కు సంబంధించినదిగా తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి వైరల్ కావడంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సమంతనే మోసం చేసినట్లు ఇన్నాళ్లకు నిజం ఒప్పుకున్నాడని చర్చించుకుంటున్నారు. కాగా.. చై సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో డేటింగ్ చేస్తున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అలాగే వీరిద్దరు ఓ హోటల్‌కు వెళ్లిన దిగిన ఫొటోలు కూడా బయటకు రావడంతో అంతా నిజమే అనుకున్నారు. కానీ వీరిద్దరూ స్పందించి వాటన్నింటినీ కొట్టిపారేశారు.