నాగచైతన్య, సమంతను మళ్లీ కలవాలనుకుంటున్నాడా..! హింట్ ఇస్తూ పోస్ట్

by Hamsa |   ( Updated:2023-10-10 04:51:25.0  )
నాగచైతన్య, సమంతను మళ్లీ కలవాలనుకుంటున్నాడా..! హింట్ ఇస్తూ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: నాగచైతన్య, సమంత 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏవో కారణాల వల్ల 2021లో విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. వారు విడిపోవడానికి కారణం ఏమిటనేది ఇంతవరకు ఎవరూ వెల్లడించలేదు. ఇక అప్పటి నుంచి వీరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒకటి చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వీరిద్దరు ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటే ఫుల్ బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలో తాజాగా, సమంత, నాగచైతన్య కలవబోతున్నారని ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు వారి వద్ద ఒక ఫ్రెంచ్ బుల్ డాగ్ ఉండేది. ఇలీవలే ఈ కుక్క నాగ చైతన్య ఇంట్లో ఉన్న వీడియో వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా నాగ చైతన్య ఆ కుక్క ఫొటోను షేర్ చేశాడు. తన కారులో పక్క సీట్లో కూర్చుని కుక్క ఉంది. సమంత వద్ద ఉండే ఈ కుక్కను ఇప్పుడు నాగ చైతన్య చూసుకుంటున్నాడు. దీనిని ఇప్పుడు షేర్ చేయడంతో వీరిద్దరూ మళ్లీ కలవబోతున్నారని అందుకే ఆ ఫొటోను చై షేర్ చేశాడని అనుకుంటున్నారు. మరికొంత మంది మీరు కలిస్తే చాలా బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed