- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Naga Chaitanya- Sobhita: నాగచైతన్య-శోభితా పెళ్లి తేదీ ప్రకటించిన అక్కినేని ఫ్యామిలీ.. ఖుషిలో ఫ్యాన్స్..?
దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరో నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగచైతన్య నిన్న హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ఎవరికి తెలియకుండా నాగార్జున పకడ్భందిగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నాగచైతన్య-శోభితా ఎంగేజ్‌మెంట్ ఫొటోలు చూశాక చాలా సింపుల్ బట్టల్లో నిశ్చితార్థం జరుపుకున్నట్లు తెలుస్తుంది. నిన్న ఉదయం నుంచి సోషల్ మీడియాలో వీరి ఎంగేజ్‌మెంట్ నిజమా? కాదా? అంటూ అభిమానులు ఆందోళన చెందారు. కానీ సాయంత్రంలోగా నాగార్జున నాగచైతన్య-శోభితా నిశ్చితార్థం పిక్స్ నెట్టింట వదలడంతో తెలుగు ప్రజలంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ప్రస్తుతం వీరి నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
సమంతతో విడిపోయినాక నాగచైతన్య హీరోయిన్ శోభితాతో ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. ఇకపోతే నిన్న బంధువుల సమక్షంలో శోభితకు ఉంగరం తొడిగాడు నాగచైతన్య. వీరి ఎంగేజ్‌మెంట్ కు కేవలం ఇరుకుంటుంబ సభ్యులు అండ్ దగ్గరి రిలేషన్స్ మాత్రమే హాజరయ్యాని సమాచారం. అయితే నిశ్చితార్థం అనంతరం నాగార్జున చై-శోభితా వివాహ తేదీని ప్రకటించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. వచ్చే నెల(సెప్టెంబరు) 20 తారీకు లోపు సినీ సెలబ్రిటీలను ఆహ్వానించి శోభిత-చైతన్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించబోతున్నట్లు నాగార్జున చెప్పినట్లు జనాలు చర్చించుకుంటున్నారు. మరీ ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.