Samantha: నాగ చైతన్య- సమంత విడాకులు.. భరణంగా ఎన్ని కోట్లు డిమాండ్ చేసిందో తెలిస్తే షాక్.. సంచలన పోస్ట్ వైరల్

by Kavitha |   ( Updated:2024-08-14 09:39:24.0  )
Samantha: నాగ చైతన్య- సమంత విడాకులు.. భరణంగా ఎన్ని కోట్లు డిమాండ్ చేసిందో తెలిస్తే షాక్.. సంచలన పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: ‘ఏమాయ చేసావే’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత అందరికీ సుపరిచితమే. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలా తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ రేంజ్‌కు ఎదిగింది. ఇక ఆ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్లింది. అలా ఇరు కుటుంబాల ఇష్టంతో ఇద్దరు వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. కానీ, మనస్పర్థలు రావడంతో వీరి పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయి నాలుగేళ్లలోనే విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల తర్వాత సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడడంతో సినిమాలకు దూరంగా ఉంటూ హెల్త్ పై కాంసన్‌ట్రేషన్ చేస్తుంది. కాగా తాజాగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌తో మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసింది ఈ బ్యూటీ.

ఇదిలా ఉంటే.. నాగచైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ తర్వాత సమంతకు సంబంధించిన చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈమెకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. బేసిక్‌గా విడాకుల తర్వాత సెలబ్రీటీలు కావచ్చు కామన్ పర్సన్స్ కావోచ్చు భరణం కింద ఎంతో కొంత చెల్లిస్తారు అనే విషయం మనకు తెలిసిందే. అలాగే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు నాగచైతన్య, అతని కుటుంబం విడాకుల కోసం పరిహారం డబ్బుగా.. దాదాపు 200 కోట్ల భారీ మొత్తంలో డబ్బులు సమంతాకు ఆఫర్ చేశారట. అయితే ఆ డబ్బును తీసుకోవడానికి సమంత నిరాకరించిందట. అంతే కాకుండా నేను ఏమీ లేకుండా స్టార్‌గా మారాను, కాబట్టి ఎవరి మద్దతు, సహాయసహకారాలు నాకు అవసరం లేకుండానే నా జీవితాన్ని కొనసాగించుకుంటాను అని సామ్ తెగేసి చెప్పిందట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారగా.. సామ్ ఫ్యాన్స్ మాత్రం గ్రేట్ పర్సన్‌ను మిస్ చేసుకున్నాడు నాగ చైతన్య.. మా సమంత అందంలోనే కాకుండా మనసు కూడా బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

అక్కినేని ఫ్యామిలీకి బిగ్ షాక్: స్టార్ డైరెక్టర్‌తో సమంత డేటింగ్.. ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుందా పిక్స్ వైరల్?


(video link credits to samanthrruthprabhuu instagram id)

Advertisement

Next Story