మరోసారి విడాకులు తీసుకోవడానికి కోర్టుకెక్కనున్న Naga Chaithanya.. క్లారిటీ ఇవ్వడానికేనా?

by samatah |   ( Updated:2023-07-16 08:19:00.0  )
మరోసారి విడాకులు తీసుకోవడానికి కోర్టుకెక్కనున్న Naga Chaithanya.. క్లారిటీ ఇవ్వడానికేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని నాగచైతన్య మరోసారి విడాకులు తీసుకోవడానికి కోర్టు మెట్లు ఎక్కబోతున్నాడంట. ఏంటీ సమంతను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నాడుగా, మళ్లీ విడాకులు ఏంటీ అని ఆలోచిస్తున్నారా? ఇది రియల్ లైఫ్‌లో కాదండి.. రీల్ లైఫ్‌లో. అయితే చాలా రోజుల నుంచి అక్కినేని ఫ్యామిలీలో మంచి హిట్ లేదు. సినిమాల పరంగా ఆ ఫ్యామిలీ చాలా డల్ అయిపోయింది.

చైతన్యకు వరసగా ఫ్లాప్సే దర్శనం ఇస్తున్నాయి. ఈ క్రమంలో నాగచైతన్య ఎలాగైన హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడంట. ఈ క్రమంలోనే తాను నిజ జీవితంలో బాధపడిన అంశం విడాకులు. అయితే దీన్ని తెరపై చూపించడానికి రెడీ అయ్యాడంట. సమంతను పెళ్లి చేసుకొని నాగచైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి వరసగా వీరిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. దీంతో వీటికి బ్రేక్ వేయడానికి విడాకుల విషయంలో తప్పు ఎవరిది అన్నది జనాలకు తెలియాలనే ఉద్దేశంతో నాగచైతన్య తమ విడాకులకు సంబంధించిన కంటెంట్ తోనే తెరపై కనిపించబోతున్నారట . ఈ క్రమంలోనే నాగచైతన్య సినిమాల్లో మరోసారి డివర్స్ తీసుకున్న హస్బెండ్ గా కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

Also Read: తల్లికి ప్రామిస్ చేసి.. సమంతను అమెరికా తీసుకెళ్తున్న స్టార్ హీరో?

Advertisement

Next Story

Most Viewed