‘తండేల్‌’ మూవీ యూనిట్ పై ఫైర్ అవుతున్న నాగచైతన్య ఫ్యాన్స్ ..

by Kavitha |   ( Updated:2024-01-06 03:29:58.0  )
‘తండేల్‌’ మూవీ యూనిట్ పై ఫైర్ అవుతున్న నాగచైతన్య ఫ్యాన్స్ ..
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో చై కి జోడిగా లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి హీరోయిన్‍గా నటిస్తుంది. ఇక యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ కి సంబందించిన గ్లింప్స్‌ను జనవరి 5 రిలీజ్ చేయనున్నట్టు, ఇటీవల మూవీ యూనిట్ వెల్లడించింది. కానీ ఇంతలోనే గ్లింప్స్ వాయిదా పడింది.

ముందుగా ప్రకటించిన దాని ప్రకారం.. ఈ గ్లింప్స్ జనవరి 5 సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కావాల్సింది. కానీ కాస్త ఆలస్యం అవుతుందంటూ సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’ తీసుకొస్తామని అప్‍డేట్ ఇచ్చారు. దీంతో నాగచైతన్య అభిమానులు వేచిచూశారు.. కానీ సాయంత్రం కూడా గ్లింప్స్ రిలీజ్ చేయలేదు. కాసేపటి తర్వాత.. ‘ఊహించని సాంకేతిక కారణాల వల్ల ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’ నేడు విడుదల కాదు. ఈ అద్భుతమైన గ్లింప్స్ రేపు (జనవరి 6) వస్తుంది’ అని గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. దీంతో గ్లింప్స్ కోసం ఎంతగానో ఎదురుచూసిన నాగచైతన్య ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు.. ‘గ్లింప్స్ రెడీగా లేకపోతే ముందుగానే వాయిదా ప్రకటించాలి. ఇలా ఎదురుచూయించి నిరాశ పరుస్తారా’ అని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.


Advertisement

Next Story