ఏంటి.. నాగచైతన్య- అనుష్కకు పెళ్లా?ఆగ్రహం వ్యక్తం చేసిన నాగార్జున!!

by Anjali |
ఏంటి.. నాగచైతన్య- అనుష్కకు పెళ్లా?ఆగ్రహం వ్యక్తం చేసిన నాగార్జున!!
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో నాగార్జున-అనుష్క జంటకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. వీరిద్దరి కలయికలో తెరకెక్కిన చిత్రాలు ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘‘సూపర్ సినిమాతో మొదలైన వీరి జర్నీ.. తర్వాత డాన్, కింగ్, కేడీ, రగడ, డమరుకం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి, ఓం నమో వెంకటేశాయ’’ సినిమాల్లో కలిసి నటించారు. దాదాపు పది సినిమాల్లో కలిసి నటించిన ఈ జంటకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. నాగార్జున చాలా గ్యాప్ తర్వాత రీసెంట్ గా ‘నా సామిరంగ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. అనుష్కకైతే మూవీ అవకాశాలే కనుమరుగైపోయాయి. అప్పట్లో నవీన్ పోలిశెట్టి సరసన ‘మిస్టర్ పోలిశెట్టి’ మూవీలో నటించింది. ఇక అంతే అప్పటి నుంచి ఏ సినిమాలో నటించలేదు. ఆఫర్లు తగ్గడానికి బరువు పెరగడం ఓ కారణమని చెప్పుకోవచ్చు.

అయితే నాగార్జున-అనుష్క సినిమాల్లో కలిసి నటిస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య సంథింగ్.. సంథింగ్ ఉందని నెట్టింట టాక్ వినిపించింది. అలాగే 10 ఏళ్ల కిందట నాగార్జున- అనుష్కకు పెళ్లి జరగబోతుందంటూ.. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేసింది. కానీ నాగార్జున అనుష్క-చైతన్య పెళ్లికి అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. ఈ రూమర్లపై నాగార్జున స్పందించి.. ఇవన్నీ అవాస్తవాలని క్లారిటీ ఇస్తూ మండిపడ్డారు. ప్రస్తుతం అనుష్క ఓ క్రికెటర్‌ను పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ క్రమంలో నాగ చైత్యన్య - అనుష్క పెళ్లి రూమర్‌ను గుర్తు చేస్తూ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed