‘హెడ్ అప్ హై’.. ‘కస్టడీ’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

by Anjali |   ( Updated:2023-04-11 13:16:23.0  )
‘హెడ్ అప్ హై’.. ‘కస్టడీ’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్
X

దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. కాగా మే 12 విడుదల కాబోతున్న మూవీ నుంచి విడుదలైన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుండగా.. తాజాగా ఫస్ట్ సింగిల్ ‘హెడ్ అప్ హై’ లిరికల్ వీడియో విడుదల చేశారు మేకర్స్. అరుణ్ కౌండిన్య, అసల్ కోలార్‌లతో పాటు యువన్ శంకర్ రాజా స్వయంగా పాడిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉన్న ఈ సాంగ్ పోలీసుల గొప్పతనాన్ని వర్ణిస్తుండగా.. నాగ చైతన్య తన గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూవ్స్‌తో పాటలోని ఎనర్జీని మ్యాచ్ చేశారు.

Read more:

సమంత కారణంగా అక్కినేని ఫ్యామిలీలో గొడవలు?

నాజీవితం ఓ తెరచిన పుస్తకం.. చైతూనుద్దేశించి సమంత షాకింగ్ కామెంట్స్?

Advertisement

Next Story

Most Viewed