ఆ విషయంలో నా భార్య చాలా స్ట్రిక్ట్ : స్టార్ నటుడు

by Nagaya |   ( Updated:2023-01-08 14:05:58.0  )
ఆ విషయంలో నా భార్య చాలా స్ట్రిక్ట్ : స్టార్ నటుడు
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు శివ బాలాజీ తన భార్య మధుమిత వ్యక్తిత్వం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. 'మా కుటుంబాన్నే కాదు నాకు సంబంధించిన ఫైనాన్షియల్ విషయాలన్నీ మధు చూసుకుంటుంది. నాకు మాత్రం ఫ్యామిలీని నడిపించడం తెలియదు. డబ్బు కూడా పొదుపు చేయ్యలేను. మాకు ఎప్పటినుంచో కొన్ని వ్యాపారాలున్నాయి. ఎవరైనా వచ్చి అడిగితే కాదనకుండా ఇచ్చేస్తాను. అలా ఇచ్చి కొంతమంది చేతిలో మోసపోయా. అందుకే నా బాధ్యతలన్నీ భార్యకే అప్పగించేశా. మధు ఒకటికి పదిసార్లు అన్ని చెక్ చేసుకుని నిర్ణయం తీసుకుంటుంది' అంటూ చెప్పుకొచ్చాడు బాలాజీ.

Advertisement

Next Story

Most Viewed