నన్ను బిగ్ బాస్ 7 నుంచి పీకేశారంటూ వీడియో రిలీజ్ చేసిన మై విలేజ్ షో అనీల్

by Prasanna |   ( Updated:2023-09-02 17:55:04.0  )
నన్ను బిగ్ బాస్ 7 నుంచి పీకేశారంటూ వీడియో రిలీజ్ చేసిన మై విలేజ్ షో అనీల్
X

దిశ,వెబ్ డెస్క్: ఈ సారి బిగ్ బాస్ సీజన్ 7 మొదలయ్యే వరకు హౌస్లోకి ఎవరు వస్తారో? ఎవరు రారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న మొగలిరేకులు సాగర్‌ ను తీసేసారు.. తాజాగా .. మై విలేజ్ షో అనీల్ గీలా పేరు కూడా బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు అనీల్ గీలాని కూడా కంటెస్టెంట్స్ లిస్ట్‌ నుంచి తప్పించారు. 99.99 శాతం కన్ఫామ్ అని బిగ్ బాస్ నుంచి అఫీషియల్ కాల్ వెళ్లిన తరువాత.. ఇంటర్వ్యూ ప్రాసెస్ పూర్తైన తరువాత అనీల్‌ని లిస్ట్ నుంచి పీకి పక్కనపెట్టారు. తాజాగా ఆయన షేర్ చేసిన వీడియోలో.. తాను బిగ్ బాస్ సీజన్ 7కి వెళ్లడం లేదని విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు అవకాశం ఇస్తారని అనుకున్నా.. కానీ నేనేం బాధ పడటం లేదు.. నా దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంది. త్వరలో మీ ముందుకి మంచి ప్రాజెక్ట్‌తో వస్తాను. ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వస్తున్నా.. మై విలేజ్ షోతో మరిన్ని వీడియోలు చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read More: Guppedantha Manasu ఆగస్ట్ 31 : విశ్వం కోరిక రిషి తీరుస్తాడా.. వసుధారని కాదని ఏంజెల్ ని పెళ్లి చేసుకుంటాడా?

Advertisement

Next Story

Most Viewed