హీరోల అందరికన్నా నా కొడుకే బాగుంటాడు.. ప్రముఖ నిర్మాత కామెంట్స్ వైరల్

by Anjali |   ( Updated:2023-03-31 08:43:26.0  )
హీరోల అందరికన్నా నా కొడుకే బాగుంటాడు.. ప్రముఖ నిర్మాత కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలో ‘దమ్ములపాటి శ్రీనివాసరావు’ ఒకరు. ఇండస్ట్రీలో ఈ నిర్మాతను అందరూ డీఎస్ రావు అని పిలుస్తారు. డీఎస్ రావు తక్కువ సినిమాలే నిర్మించినా.. అభిరుచి ఉన్న నిర్మాత(producer)గా పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఈ నిర్మాత ఓ ఇంటర్వ్యూకి హాజరై మాట్లాడుతూ...‘‘ ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలలో ఏ హీరో కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. మనోజ్‌తో చేసిన చిత్రం అయితే చాలా ఇష్టంతో తీశాను. నేను హీరోలను ఇబ్బంది పెట్టే వ్యక్తిని అయితే పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసేవాడిని. హీరోలు షూటింగ్ మధ్యలో గొడవ పడితే ఫైనాన్షియర్ల నుంచి సమస్యలు ఎదురవుతాయి. సహజంగా ఇండస్ట్రీలో ఇచ్చిన డబ్బులు ఎవరూ తిరిగి ఇవ్వరు కానీ శ్రియ మాత్రం రూ.5 లక్షలు తిరిగి పంపించింది. కొన్ని కారణాల వల్ల ఆమె ‘‘మిస్టర్ నూకన్య’’ మూవీ నుంచి తప్పుకుంది. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. సినిమా ఆర్టిస్ట్ కావాలని అనుకున్నాను. ఆ సమయంలో ఓ వ్యక్తి పరిచయం అయ్యి, నన్ను సినిమాల్లోకి లాగాడు. నేను కన్‌స్ర్టక్షన్‌లో ఉంటే బాగుండు’’ అంటూ డీఎస్ రావు చెప్పుకొచ్చారు.

చిన్న హీరోలతో సినిమాలు చేయకూడదని, తీస్తే అల్లు అర్జున్‌తో సినిమా తీయాలని తెలిపారు. అలాగే తన కుమారుడి గురించి వెల్లడించారు. ‘‘నా పెద్ద కుమారుడు హీరోల కంటే అందంగా ఉంటాడు. ఇక చదువులో అయితేనా టాపర్’’ అంటూ నిర్మాత డీఎస్ రావు తెలిపిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి: Ravi Teja: రవి తేజతో రామ్ పోతినేని వార్ ?

Advertisement

Next Story