మా అక్క అలాంటిది, ఎవరినీ కూడా.. ఎన్టీఆర్ భార్య నిజ స్వరూపం బయటపెట్టిన సొంత తమ్ముడు!

by Kavitha |
మా అక్క అలాంటిది, ఎవరినీ కూడా.. ఎన్టీఆర్ భార్య నిజ స్వరూపం బయటపెట్టిన సొంత తమ్ముడు!
X

దిశ, సినిమా: స్టార్ కపూల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రణతి స్టార్ హీరో భార్య అయినప్పటికీ చాలా సింపుల్‌గా ఉంటుంది. అంతే కాకుండా బయట కెమెరా ముందు కూడా కనిపించరు. అలాగే సినిమా ఈవెంట్స్‌కి హాజరుకారు. అసలు లక్ష్మి ప్రణతి నేచర్ ఎలాంటిది? ఆమె ఎలా ప్రవర్తిస్తారు? వంటి విషయాలు ఎవరికీ తెలియదు. కానీ, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి ఇతర హీరోల భార్యలతో పోల్చుకుంటే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి చాలా డిఫరెంట్ అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా లక్ష్మి ప్రణతిని ఉద్దేశిస్తూ ఆమె తమ్ముడు నార్నె నితిన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

నార్నే నితిన్ హీరోగా ‘ఆయ్’ సినిమా ద్వారా ఆగస్టు 15వ తేదీన మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు నితిన్. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. తమ్ముడిగా నాకు అక్కతో మంచి బాండింగ్ ఉంది. కానీ ఆమె చాలా రిజర్వ్డ్ . ఆమె ఎవరిని కలవదు..పెద్దగా మాట్లాడదు కూడా. కానీ మా మధ్య మాత్రం మంచి అనుబంధం ఉంది అంటూ నితిన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా లక్ష్మి ప్రణతిని 2011లో ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. పెద్దబ్బాయి పేరు అభిరామ్ కాగా, చిన్నబ్బాయి పేరు భార్గవ్ రామ్.

Advertisement

Next Story