- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నా ప్రైజ్ మనీలో వాళ్లే రూ. 27 లక్షలు లాగేశారు.. బిగ్‌బాస్-5 విన్నర్ వీజే సన్నీ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. ఇందులో పాల్గొన్న వారికి బయటకు వచ్చాక మంచి ఫేమ్ కూడా వచ్చింది. దీంతో చాలా మంది హౌస్‌లోకి వెళ్లి విన్నర్ అవ్వాలని కోరుకుంటారు. అలాగే వీజే సన్నీ కూడా బిగ్‌బాస్-5 సీజన్‌లో పాల్గొని విన్నర్‌గా నిలిచి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా, ఓ ఇంటర్యూలో పాల్గొన్న సన్నీ బిగ్‌బాస్ ప్రైజ్ మనీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘ నేను విన్నర్ అయితే కంగ్రాట్యులేట్ నా ఒక్కడినే చెప్పుకోలేదు. గవర్నమెంట్‌కు కూడా చెప్పాను. ఎందుకంటే.. జీఎస్టీ ద్వారా నాకంటే ఎక్కువగా ఫిఫ్టీ-ఫిఫ్టీ షేర్ చేసుకున్నట్టే మేము. ఆడింది నేను గెలిచింది వాళ్లు అనేలా ఉంది.
ఆట నాది ప్రైజ్ మనీ వాళ్లది. బిగ్‌బాస్ విన్నర్ అయిన నాకు రూ. 50 లక్షలు ఇవ్వాలి. కానీ అందులో దాదాపు రూ. 27 లక్షల వరకు ప్రభుత్వానికి వెళ్ళిపోయింది. అంత డబ్బు టాక్స్ రూపంలో తీసేసుకున్నారు. కరెక్ట్‌గా ఎంతనేది నాకు గుర్తు లేదు కానీ దాదాపు సగానికి సగం టాక్స్ ద్వారా తీసుకున్నారు. మిగిలిన రూ. 23 లక్షల డబ్బులు నాకు ఇచ్చారు. డొనేషన్ రూపంలో చాలామంది టాక్స్ ఎగొడుతుంటారు. కానీ మనకు అన్ని తెలివితేటలు ఉంటే.. ఇక్కడెందుకు ఉంటాం. అందుకే ఫుల్ అమౌంట్ టాక్స్ రూపంలో కట్టాల్సి వచ్చింది’’ అని చెప్పుకొచ్చాడు.