అబ్బాయిలకు అసహ్యంగా కనిపించాలని మా అమ్మ నా జుట్టు కట్ చేసింది: పలక్

by Prasanna |   ( Updated:2023-07-24 12:15:07.0  )
అబ్బాయిలకు అసహ్యంగా కనిపించాలని మా అమ్మ నా జుట్టు కట్ చేసింది: పలక్
X

దిశ, సినిమా: యుక్త వయసులో తన తల్లి, నటి శ్వేత తివారి తనపై చేసిన ప్రయోగాలను అభిమానులతో షేర్ చేసుకుంది నటి పలక్ తివారీ. రీసెంట్‌గా ఓ సమావేశంలో గత జ్ఞాపకాలను తలచుకుంటూ.. ‘మా అమ్మ నా చిన్నప్పటినుంచి హెయిర్ స్టైల్ అబ్బాయిలాగే ఉండేలా చూసేది. అయితే కాస్త వయసుపెరుగుతున్న కొద్ది జుట్టు సైజు పెంచుకోవడం ప్రారంభించాను. దీంతో నేను అబ్బాయిలతో డేటింగ్ చేస్తానేమోనని చాలా భయపడేది. నేను అసహ్యంగా కనిపించేందుకు ఒకసారి నా జుట్టును కూడా కత్తిరించింది. నేను ఎవరితో ప్రేమలో పడనని మాటిచ్చినా పెద్దగా నమ్మేది కాదు. సినిమాల్లోకి రావడానికి కొద్ది రోజుల ముందు నా హెయిర్‌ను ఫ్రీగా వదిలేసింది’ అని చెప్పుకొచ్చింది. అలాగే తన చిన్నతనంలో చాలా అబద్ధాలు చెప్పేదానినన్న నటి.. ఒకప్పుడు తన ప్రియుడితో కలిసి ఉన్నప్పుడు కూడా తన తల్లికి అబద్ధం చెప్పానని గుర్తుచేసుకుంది.

Advertisement

Next Story