నా మైండ్ కూడా సీసీ టీవీ పుటేజ్‌ లాంటిదే : Anupama Parameswaran

by Hamsa |   ( Updated:2023-06-04 07:33:13.0  )
నా మైండ్ కూడా సీసీ టీవీ పుటేజ్‌ లాంటిదే : Anupama Parameswaran
X

దిశ, సినిమా: సౌత్ ఇండస్ట్రీ‌లో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తన క్యూట్ లుక్‌తో.. కర్లీ హేర్ స్టైల్‌తో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘మూవీలో మీరు ఎక్స్‌ప్రెషన్స్ పలికించడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?’ అని ప్రశ్నించగా నటి మాట్లాడుతూ ‘సినిమాలో నా క్యారెక్టర్ ఏదైనప్పటికీ ఎక్స్‌ప్రెషన్స్ వ్యక్తపరచడంలో చాలా నిజయితీగా ఉంటాను. ఒకవేల నాకు నచ్చకపోతే మొహం మీద చెప్పేస్తా. నేను ఏ విషయం గురించైనా అతిగా అలోచించను. సీసీ టీవీ పుటేజ్‌ నెల రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా డిలీట్‌ అయినట్లు.. నా మైండ్‌లో చెత్తను డిలీట్ చేస్తుంటా. ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది. భూమి మీద మనం కొంతకాలం మాత్రమే ఉండడానికి వచ్చాం. మళ్లీ వెళ్లిపోతాం. అలాంటప్పుడు మనం ఒత్తిడి పెంచుకుని మన శక్తి ఎందుకు వేస్ట్ చేయాలి’ అని చెప్పుకొచ్చింది అనుపమ.

Read More: జూన్ 6న ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్.. అదే రోజు సెకండ్ ట్రైలర్ కూడా

ఆమెలా కావాలంటే.. ఓవర్ ఎక్స్‌పోజ్ మానుకోవాలన్నారు: నోరా

Advertisement

Next Story