ఆర్జీవీ నా నగ్న ఫొటోలు బయటపెట్టడం వల్లే నా జీవితం నాశనం అయింది.. బిగ్‌బాస్ తేజస్వి సెన్సేషనల్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-04-23 05:40:35.0  )
ఆర్జీవీ నా నగ్న ఫొటోలు బయటపెట్టడం వల్లే నా జీవితం నాశనం అయింది.. బిగ్‌బాస్ తేజస్వి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి తేజస్వి మదివాడ స్టార్ హీరోలతో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ గత కొద్ది కాలంగా ఆమెకు ఆఫర్లు రాకపోవడంతో ఖాళీగానే ఉంటుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్వి తన లైఫ్ నాశనం అవడానికి కారణాలు రివీల్ చేస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ‘‘ నేను నా కెరీర్‌లో చాలా శృంగార సన్నివేశాలు, బోల్డ్ సీన్స్ చేశాను. కానీ ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో నేను నటించినప్పుడు ఓ న్యూడ్ ఫొటో బయటకు వచ్చింది. 10 ఏళ్ల క్రితం ఆ ఫొటో వైరల్ కావడంతో.. నేను చేసిన సీన్ రాంగ్‌గా ప్రొజెక్ట్ అయింది.

ఎందుకంటే అలాంటి సీన్లను చూపించకుండా సెన్సార్ బోర్డ్ నియంత్రిస్తుంది. సినిమాల్లో న్యూడ్ సీన్లు పెట్టడానికి చాన్స్ ఉండదు కాబట్టి అలా చేస్తారు. ఆర్జీవీ రిలీజ్ చేసిన న్యూడ్ ఫొటో కారణంగా సోషల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్స్ నాపై, నా కెరీర్‌పై చెడు ప్రభావం చూపాయి. అప్పటి వరకు పక్కింటి అమ్మాయిగా ఉండే నా ఇమేజ్‌ను దెబ్బ తీశాయి. ఒక్క ఆర్టికల్ వల్ల రాత్రికి రాత్రే హీరోయిన్‌గా ఉన్న నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ స్థాయికి పడిపోయిన పరిస్థితి ఏర్పడింది’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తేజస్వి కామెంట్స్ నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి.

Advertisement

Next Story