''కోబ్రా' విడుదల రోజు హాలిడే ఇవ్వాలని స్టూడెంట్స్ డిమాండ్

by Hajipasha |   ( Updated:2022-08-30 12:56:48.0  )
కోబ్రా విడుదల రోజు హాలిడే ఇవ్వాలని స్టూడెంట్స్ డిమాండ్
X

దిశ, సినిమా: తమిళ్ సూపర్‌ స్టార్‌ విక్రమ్‌ నటించిన 'కోబ్రా' మూవీ ఈ నెల 31న రిలీజ్‌ కాబోతోంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమాకు భారీ బజ్ క్రియేట్ కాగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుచిరాపల్లి సెయింట్ జోసెఫ్‌ కాలేజీకి చెందిన స్టూడెంట్స్‌ సినిమా చూడటానికి హాలీడే ఇవ్వాలని.. ప్రిన్సిపాల్‌కు లెటర్‌ రాయగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'గౌరవనీయులైన ప్రిన్సిపాల్‌ గారికి, మేము కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ స్టూడెంట్స్. కోబ్రా మూవీ రిలీజ్‌ కాబోతుంది. కావున సెప్టెంబర్‌ 1న కాలేజీకి అధికారికంగా హాలీడే ప్రకటించండి. ఆగస్ట్‌ 31న టికెట్లు అందుబాటులో లేవు. దయచేసి ఎలాంటి కాల్స్‌ లేదా మెసేజ్‌లు చేయొద్దని కోరుతున్నాం. ఎలాగూ ఆ రోజు మేము కాలేజీకి రావడం లేదు. థ్యాంక్యూ. ఇట్లు చియాన్‌ ఫ్యాన్స్‌' అంటూ లెటర్‌ రాశారు.

Also Read : 'ఆర్‌ఆర్‌ఆర్'ను క్రాస్ చేసిన 'కోబ్రా'.. ఏ విషయంలో తెలుసా?

Advertisement

Next Story