'Super Star Mahesh Babu' తో 'MS Dhoni' సినిమా..!

by srinivas |
Super Star Mahesh Babu తో MS Dhoni సినిమా..!
X

దిశ,వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల విడుదలైన సర్కారి వారి పాట బిగ్ హిట్ కాకపోయినా హిట్ అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి భారీ బడ్జెట్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత దర్శకదీరుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ధోనీ నిర్మాణ సంస్థ మొదటి సారిగా సౌత్ సినిమా హీరోలతో చేయనున్నారని, టాలీవుడ్‌లో మహేష్ బాబుతో సినిమాతో ఇది ప్రారంభం అవుతుందని ఫిల్మ్ వర్గాల టాక్. మహేష్ బాబుతోనే కాకుండా తమిళ్‌లో దళపతి విజయ్‌తో ధోనీ ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమాలు చేయబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. క్రికెట్‌ చరిత్రలో T20 ప్రపంచ కప్, 50 ఓవర్ల ప్రపంచ కప్, ICC ఛాంపియన్స్ ట్రోఫీ సహా ఇంకా మూడు ప్రధాన ట్రోఫీలను గెలుచుకున్న ధోనీ రికార్డు సృష్టించాడు. క్రికెట్‌లో విజయం సాధించిన కూల్ కెప్టెన్ ధోనీ సినిమాల్లో విజయం సాధిస్తారా.. లేదా అనేది వేచి చూడాలి.

Advertisement

Next Story