చిరంజీవితో రొమాన్స్ చేయనున్న మృణాల్?

by sudharani |   ( Updated:2023-09-07 13:32:19.0  )
చిరంజీవితో రొమాన్స్ చేయనున్న మృణాల్?
X

దిశ, సినిమా: ‘సీతారామం’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతుంది. వరుస చిత్రాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీ అయిపొయింది. ఈ క్రమంలోనే తాజాగా మృణాల్‌ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే కథ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, దానికి మృణాల్ అయితేనే న్యాయం చేయగలదని భావించి మేకర్స్ ఆమెను తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story