Mrunal Thakur:పెళ్లి కాకుండానే కూతురిని పరిచయం చేసిన మృణాల్.. తన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానంటూ కామెంట్స్

by Hamsa |
Mrunal Thakur:పెళ్లి కాకుండానే కూతురిని పరిచయం చేసిన మృణాల్.. తన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు మొదటి హిందీ సీరియల్స్ ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత సీతారామం సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన నటించి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఇందులో సీత పాత్రలో సంప్రదాయ లుక్‌లో కనిపించి తన నటనతో మృణాల ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో అమ్మడు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఆ తర్వాత హాయ్ నాన్నలో నటించిన ఆమె హిట్ తన ఖాతాలో వేసుకుంది. శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని హీరోగా నటించాడు. అయితే ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అలాగే అవార్డ్స్ రావడంతో మృణాల్ క్రేజ్ అంతకంతకు పెరిగిపోయింది.

అలాగే సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ యాక్టివ్‌గా ఉండి తన పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, మృణాల్ పెళ్లి కాకుండానే కూతురిని పరిచయం చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. హాయ్ నాన్న మూవీలో నటించిన చిన్నారి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ‘‘కియారా ఖన్నా ఎప్పటికీ నా మొదటి పాపే. భవిష్యత్తులో నాకు పిల్లలు పుట్టినా కూడా వారు నాకు రెండో సంతానమే అవుతారు. ఎందుకిలా అంటున్నానంటే.. కియారాతో నాకు ఏర్పడిన బంధం ఎప్పటికీ విడదీయలేనిది. తన నుండి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. తను కళ్ళతోనే మాట్లాడేస్తుంది. తను అంటే నాకు ఉన్న ఇష్టాన్ని మాటల్లో చెప్పలేను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. సూపర్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలో నటించినందుకే కూతురు అనుకుంటుంది ఎంత ప్రేమనో అని అంటున్నారు.

(Video Link Credits to myrakiarakhanna Instagram Channel)

Advertisement

Next Story

Most Viewed