సినిమా చాన్స్‌ల కోసం చాలా స్ట్రగుల్ అయ్యా: Mrunalthakur

by sudharani |   ( Updated:2022-09-23 09:09:10.0  )
సినిమా చాన్స్‌ల కోసం చాలా స్ట్రగుల్ అయ్యా: Mrunalthakur
X

దిశ, సినిమా : టెలివిజన్‌లో కెరీర్‌ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్‌గా అడుగులేస్తున్న మృణాల్ ఠాకూర్.. ఇండస్ట్రీ అనుభవాలను పంచుకుంది. సీరియళ్ల ద్వారా ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ అయిన తాను సినిమా ఆడిషన్‌కు వెళ్లేందుకు ఎన్నోసార్లు వెనుకడుగు వేసినట్లు తెలిపింది. బుల్లితెర కార్యక్రమాలు చేస్తున్న వారికి సినిమాలో హీరోయిన్‌గా అవకాశాలివ్వరనే ఊహాగానాలే ఇందుకు కారణమన్న ఆమె.. 2014లో వచ్చిన మొదటి చిత్రం 'విట్టి దండు'లో చాన్స్ దక్కించుకోవడానికి దాదాపు ఎనిమిది నెలలు పట్టిందని గుర్తు చేసుకుంది.

'ఆడిషన్స్‌కు వెళ్లి చాలా కష్టపడ్డాను. కనీసం ఒక్కసారైనా ఆడిషన్ తీసుకోవాలని దర్శకులను అభ్యర్థించాను. ఈ క్రమంలో నాకు ఆత్మగౌరవం లేదని చాలా మంది అనేవారు. వెళ్లొద్దని సూచించేవారు. ఇక ఆడిషన్‌కు వెళ్లిన 20-30 మందిని ఒకే గదిలో కూర్చోబెట్టేవారు. అక్కడున్న వారంతా.. టీవీలో నువ్వు బాగా చేస్తున్నావు. నీలాంటి వాళ్లు ఈ క్యూలో కూర్చోవాల్సిన అవసరం లేదని పదే పదే చెప్పేవారు. కానీ ఏదైనా భిన్నంగా చేయాలనే ఫిక్స్ అయి, అవకాశాల కోసం తిరిగాను' అని తన అనుభవాలను వెల్లడించింది.

ఇవి కూడా చ‌ద‌వండి:

చేతిలో మందు సీసాలతో రచ్చ రచ్చ చేస్తున్న హాట్‌ బ్యూటీ

పని మనిషితో విషం పెట్టించి చంపాలని చూశారు: బాలీవుడ్ నటి

Advertisement

Next Story