Mrunal Thakur : సాయి పల్లవి బాటలోనే మృణాల్ ఠాకూర్

by Prasanna |   ( Updated:2023-02-15 05:10:07.0  )
Mrunal Thakur : సాయి పల్లవి బాటలోనే మృణాల్ ఠాకూర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమలో హైబ్రిడ్ పిల్ల ఒక్కతే పీస్ అని ఇప్పటి వరకు మనం సాయి పల్లవి గురించి మాట్లాడుకున్నాం.. కానీ ఈ స్థానంలో ఇంకో హీరోయిన్ కూడా ఆక్రమిస్తుంది. సాయి పల్లవిలా ఈ ముద్దు గుమ్మ కూడా కథను మాత్రమే నమ్ముకుంది. ఒక్క సినిమాతో అందరి మనసులను దోచేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదండి.. సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్.

ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ రెమ్యునరేషన్ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. కాజల్ అయితే కథ ఎలా ఉన్నా ఒకే .. నేను అడిగిన రెమ్యునరేషన్ ఇస్తే చాలంటోంది. కానీ సాయి పల్లవి అలా కాదు .. కథ నచ్చితేనే చేస్తుంది. సినిమా నష్టాలు తెచ్చినా.. తన రెమ్యునరేషన్ వదిలేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మృణాల్ ఠాకూర్ కూడా సాయి పల్లవి బాట లోనే నడుస్తుంది. సీతారామం హిట్ తర్వాత చాలా సినిమా ఆఫర్స్ వచ్చాయి .. ఇందులో స్టార్స్ హీరోస్ సినిమాలు కూడా ఉన్నాయి. కథ ఎంచుకునే విధానంలో మాత్రమే సాయి పల్లవిని పోల్చగలం. ఇండస్ట్రీలోకి వచ్చి 8 ఏళ్ళు అయినా రాని గుర్తింపు సీతారామం సినిమాతో వచ్చింది. ఈ క్రేజ్ను కాపాడుకోవాలని .. కథ , పాత్రకు ప్రాధాన్యం ఇస్తూ నాని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి : ప్రెగ్నెసీ వార్తలపై సింగర్ సునీత క్లారిటీ!

Advertisement

Next Story