Janhvi Kapoor: ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన జాన్వీ కపూర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

by sudharani |   ( Updated:2024-07-25 09:30:06.0  )
Janhvi Kapoor: ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన జాన్వీ కపూర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో ఎన్టీఆర్ ‘దేవర’తో పాటు.. రామ్ చరణ్‌తో కూడా ఓ సినిమా లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక వీటితో పాటు బాలీవుడ్‌లో కూడా వరుస మూవీస్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే జాన్వీ తాజాగా నటించిన చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన ఈ మూవీకి శరణ్ శర్మ దర్శకత్వం వహించాడు. ఇక మోస్ట్ అవైటెడ్ క్రికెట్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మే 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇందులో జాన్వీ తన జనటకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతే కాకుండా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డానని చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ. మొన్నటి వరకు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా జూలై 26 న నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది మూవీ టీం. కాగా.. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో రాజేశ్ శర్మ, కుముంద్ మిశ్రాలు కీలక పాత్రలో కనిపించారు.

Advertisement

Next Story