జాన్వీ కొట్టిన షాట్‌కు హీరో పళ్లు ఊడిపోయాయి..(వీడియో)

by Sujitha Rachapalli |   ( Updated:2024-05-14 05:31:49.0  )
జాన్వీ కొట్టిన షాట్‌కు హీరో పళ్లు ఊడిపోయాయి..(వీడియో)
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పాన్ ఇండియా మూవీస్ తో బిజీగా ఉంది. తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో జతకడుతున్న బ్యూటీ.. ప్రస్తుతం రాజ్ కుమార్ రావుతో కలిసి 'Mr And Mrs Mahi' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రికెట్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్ లో బిజీ అయిపోయిన హీరోయిన్.. హీరోతో కలిసి క్రికెట్ ఆడుతూ కనిపించింది. తను బ్యాటింగ్ చేస్తుంటే.. రాజ్ బాల్ వేయగా.. ఆమె కొట్టిన షాట్ కు ఆయన పళ్లు విరిగినట్లు యాక్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈ ఫన్నీ వీడియోను ఆస్వాదిస్తున్న జనాలు.. మూవీ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.

ఇక ఇందులో హీరో రాజ్ కుమార్ రావు టీషర్ట్ నంబర్ 6 కాగా.. ఐపీఎల్ మ్యాచ్ లో అదే నంబర్ తో ఉన్న అవుట్ ఫిట్స్ ధరించి దర్శనమిచ్చింది. మరోసారి బాల్స్ తో డిజైన్ చేసిన బ్లౌజ్ వేసుకుని.. నెట్టింట అటెన్షన్ క్యాచ్ చేసింది. ఇక తెలుగులో త్వరలో రామ్ చరణ్ సినిమాలో జాయిన్ కాబోతున్న అమ్మడు.. ఇందుకోసం చాలా ఎగ్జయిటింగ్ గా వెయిట్ చేస్తున్నట్లు చెప్తుంది.

Advertisement

Next Story