ప్రభాస్‌తో మూవీ..? రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ‘యానిమల్’ బోల్డ్ బ్యూటి

by Prasanna |   ( Updated:2023-12-11 06:38:14.0  )
Tripti Dimri
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ ‘యానిమల్’‌తో ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అయిపోయింది నటి తృప్తి డిమ్రి. బోల్డ్ సీన్లలో నటించి ఆకట్టుకున్న తృప్తి అందానికి, నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతుండటంతో ఆమె సరికొత్త నేషనల్ క్రష్ అయింది. ముఖ్యంగా రణ్‍బీర్‌తో తృప్తి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇక ఈ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తదుపరి చిత్రం ‘స్పిరిట్’ రెబల్ స్టార్ ప్రభాస్‍తో చేయనున్న విషయం తెలిపిందే. అయితే ఇందులో ప్రభాస్ సరసన తృప్తి నటించనుందని కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె దీనిపై స్పందించింది..‘ప్రభాస్ ‘స్పిరిట్’ ప్రాజెక్టులో నేను లేను. ఇప్పటి వరకైతే నాకలాంటి చాన్స్ రాలేదు’ అని తెలిపింది. అలాగే ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ గురించి మాట్లాడుతూ.. ‘యానిమల్‍’లో ఇంటిమేట్ సీన్లపై నా పేరెంట్స్ కూడా మొదట్లో అభ్యంతరం చెప్పారు. కానీ నేనెలాంటి తప్పు చేయడం లేదని, అది ప్రొఫెషన్ అని వివరించాను. నటి అన్నాక నిజాయితీగా తన క్యారెక్టర్‌కి 100 పర్సెంట్ న్యాయం చేయాలి. నేనూ అదే చేశాను. ఇందులో సమస్య ఏం లేదు’ అని చెప్పుకొచ్చింది తృప్తి. ప్రజెంట్ ఈ అమ్మడు మాటలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story