శరత్ బాబుకు మూడు పెళ్లిళ్లు.. 25 మంది పిల్లలు!

by Nagaya |   ( Updated:2023-05-23 06:17:14.0  )
శరత్ బాబుకు మూడు పెళ్లిళ్లు.. 25 మంది పిల్లలు!
X

దిశ, వెబ్‌డెస్క్ : చిత్రసీమను నాలుగున్నర దశాబ్దాలను ఏలిన నటుడు శరత్ బాబు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నటించిన మెప్పించిన నటుడు శరత్ బాబు. 1973లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన 2023 వరకు అప్రతిహతంగా విజయ ఢంకా మోగించారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి నటించడం శరత్ బాబుకు వెన్నతో పెట్టిన విద్య. నట జీవితం విజయవంతం అయినా ఆయన వైవాహిక జీవితం ఒడిదుడుకులను ఎదుర్కొందనే చెప్పాలి. పెళ్లి అనే అంశం శరత్ బాబుకు అంతగా కలిసి రాలేదు. ఇద్దరిని అధికారికంగా వివాహమాడినా సీక్రెట్‌గా మరొకరితో కాపురం చేసినట్లు చిత్రపరిశ్రమలో టాక్ ఉంది.

శరత్ బాబు హీరోగా నటిస్తున్న సమయంలో అప్పటికే ఇండస్ట్రీలో లేడీ స్టార్ కమెడీయన్‌గా వెలుగొందుతున్న రమాప్రభతో ప్రేమలో పడ్డారు. ఆమె శరత్ బాబు కంటే వయసులో నాలుగేళ్లు పెద్దది. అయినా ఇద్దరు ప్రేమలో మునిగి.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు 14 ఏళ్లపాటు ఎంతో అన్యోన్యంగా సంసారం చేసినా ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహలతను పెళ్లి చేసుకున్న ఆయన కొన్నాళ్లకే ఆమెతోనూ విడిపోయారు. ఈ రెండు బంధాలు తెగిపోవడంతో కొంతకాలం పాటు ఒంటరిగానే గడిపిన శరత్ బాబు.. నటి నమితను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారనే ప్రచారం అటు కొలీవుడ్, ఇటు టాలీవుడ్‌గా విస్తృతంగా జరిగింది. ఈ వార్తలను ఆయన ఖండించినా ఆ ప్రచారం మాత్రం ఆగలేదు. అయితే మీకు పిల్లలు లేరా..? అనే ప్రశ్నకు శరత్ బాబు పలు ఇంటర్వ్యూలతో మరో క్వశ్చన్ వేయకుండా సమాధానం ఇచ్చేవారు. తన సోదరులు, సోదరీమణుల పిల్లలే 25 మంది ఉన్నారు. వారంతా నా పిల్లలే అంటూ సమాధానం ఇస్తుండేవారు. కాగా, పూర్తిగా శాకాహారి, ఎలాంటి దురలవాట్లు లేని శరత్ బాబు మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌ కావడంతో నెల రోజులుగా ఏఐజీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Read More:

‘శరత్ బాబు సిగరేట్ కాల్చొద్దు అనేవారు’

బిగ్ బ్రేకింగ్ : సినీ నటుడు శరత్ బాబు కన్నుమూత

Advertisement

Next Story