ఆమె అందం, అభినయానికి ఫిదా అయ్యా: తేజస్విపై మౌనీ ప్రశంసలు

by Hamsa |   ( Updated:2022-09-15 08:58:55.0  )
ఆమె అందం, అభినయానికి ఫిదా అయ్యా: తేజస్విపై మౌనీ ప్రశంసలు
X

దిశ, సినిమా: హాట్ బ్యూటీ మౌనీ రాయ్ సహ నటి తేజస్వి ప్రకాష్‌పై ప్రశంసలు కురిపించింది. ఇటీవల తాను నటించిన 'బ్రహ్మాస్త్ర' హిట్ టాక్ సొంతం చేసుకోగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న మౌనీ.. తాజాగా తేజస్వితో చేసిన ముఖాముఖిలో టెలివిజన్ ధారావాహిక 'నాగిన్ 6' గురించి ప్రస్తావిస్తూ యంగ్ బ్యూటీని పొగిడేసింది.

సీజన్ 6లో ఆమె చాలా ప్రకాశవంతంగా, అందంగా కనిపించిందని.. దయచేసి ఇలాంటి టాలెంట్ కలిగివున్న అమ్మాయిలను సినిమాల్లోకి తీసుకోవాలని మేకర్స్‌కు సూచించింది. ఇక తాను సీజన్ 1,2లో షోషించిన పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను తేజస్వి పోషించడం చూస్తే తన లాఠీని ఆమెకు అందించినట్లే అనిపించిందని పేర్కొంది. ప్రస్తుతం వీరిద్దరి సరదా వీడియో వైరల్ అవుతోంది.

Also Read: నిర్మాతలతో సెక్స్ చేస్తేనే ప్రతిఫలం.. ఎఫైర్ పెట్టుకోకపోతే రాణించడం కష్టమే!

Advertisement

Next Story