ఆమె నాకు పుట్టలేదు.. చెత్త కుండీ దగ్గర దొరికితే పెంచుకున్నా: మిథున్

by samatah |
ఆమె నాకు పుట్టలేదు.. చెత్త కుండీ దగ్గర దొరికితే పెంచుకున్నా: మిథున్
X

దిశ, సినిమా: సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కూతురు, నటి దిశాని పుట్టుకకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ముగ్గురు కొడుకులను జన్మనిచ్చిన మిథున్‌కు ఒక్కగానొక్క కూతురు ఉండగా.. నిజానికి ఆమె తనకు పుట్టలేదంటూ మిథున్ సంచలన విషయం బటయపెట్టాడు. ‘దిశాని నా దత్తపుత్రిక. ఆమె కుటుంబ సభ్యులు చిన్నపుడే రొడ్డు పక్కన చెత్త కుండీ దగ్గర విడిచిపెట్టి వెళ్లారు. అనుకోకుండా నా కంటపడింది. ఆ తర్వాత ఆమె పరిస్థితి గురించి తెలుసుకుని దత్తత తీసుకున్నా. కోల్‌కతాలో జన్మించిన దిశాని చక్రవర్తి.. బాల్యంనుంచే నటన పట్ల చాలా ఆసక్తి కలిగివుండేది. దీంతో నేను ప్రోత్సహించాను’ అంటూ ఓ సమావేశంలో చెప్పుకొచ్చినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇక 2017లో తన షార్ట్ ఫిల్మ్ ‘గిఫ్ట్’తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన దిశాని.. ఇటీవల వచ్చిన ‘ది గెస్ట్ ఇన్ 2022’ షార్ట్ ఫిల్మ్‌లో నటనకుగానూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.


Advertisement

Next Story