- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుమార్తె ఎంట్రీపై మంత్రి రోజా రియాక్షన్
దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల శ్రీవారిని రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. మంత్రి రోజా తన జన్మదిన సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. మంత్రి రోజాతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, జబర్దస్త్ టీం సభ్యులు, ప్రముఖ సింగర్ మంగ్లీ ఆమెసోదరి ఇంద్రావతి చౌహాన్‌లు కూడా మంత్రి రోజాతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత ఆలయం వెలుపల మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పుట్టినరోజు జరుపుకుంటున్నట్లు ఆర్‌కే రోజా తెలిపారు. కార్తీక్ మాసం సందర్భంగా తిరుమలకు రావడం, తన పుట్టిన రోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వామివారి దివ్య రూపం ఎన్ని సార్లు చూసిన మర్చిపోలేనిదని...మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుందని మంత్రి ఆర్‌కే రోజా వెల్లడించారు.
అన్షుమాలిక సినీ ఎంట్రీపై రోజా
టాలీవుడ్‌లో ఇప్పటికే సీనియర్ నటులు వారసులు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా మంత్రి ఆర్‌కే రోజా కుమార్తె అన్షు మాలిక కూడా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుందంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఓ ప్రముఖ హీరో తనయుడు సరసన మంత్రి ఆర్ కే రోజా కుమార్తె అన్షుమాలిక నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఇందులో భాగంగానే త్వరలోనే అన్షుమాలికను యూఎస్‌లోని ప్రముఖ యాక్టింగ్ స్కూల్‌లో జాయిన్ చేస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంపై మంత్రి రోజా క్లారిటీ ఇచ్చేశారు. నా కూతురు సైంటిస్టు అవ్వాలనే ఆలోచన ఉందన్నారు. ప్రస్తుతానికి సినిమాలో నటించే ఆలోచన లేదని మంత్రి రోజా తెలిపారు. తన కుమార్తె, కుమారుడు యాక్టింగ్ చేయడం తప్పని తాను ఎప్పుడూ అననని రోజా వెల్లడించారు. ఇద్దరూ యాక్టింగ్ చేయాలని సినిమా ఇండస్ట్రీకి వస్తే తాను సంతోషంగా స్వాగతిస్తానని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. కుమార్తె అన్షు మాలిక చదువుపై ప్రత్యేక శ్రద్ధ ఉందని చెప్పుకొచ్చారు. సైంటిస్ట్ అవ్వాలనే ఆలోచన ఆమెకు ఉందని చెప్పుకొచ్చారు. అన్షమాలిక ప్రస్తుతం బాగా చదువుకుంటుందని.. ఇప్పటికైతే సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇక సినిమాల్లోకి వస్తానంటే మాత్రం ఒక తల్లిగా, హీరోయిన్‌గా తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని మంత్రి ఆర్‌కే రోజా స్పష్టం చేశారు.
స్వామివారి, జగనన్న ఆశీస్సులతోనే ఈ స్థాయికి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీస్సులతో రాజకీయంగా ఉన్నతమైన స్థానానికి చేరుకున్నట్లు మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు. ఒక సోదరిలా తనను జగన్ ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారని అన్నారు. శ్రీవారిని దర్శించుకోగానే తిరుపతి, చుట్టుపక్కల వాళ్లకు స్వామివారి కుటుంబ సభ్యులమనే ఫీలింగ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. తనకు కూడా మాస్వామి అనే ఫీలింగ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎక్కడికి వెళ్లినా తమను తిరుపతి వాళ్లు అని అప్యాయంగా పిలుస్తుంటారని చెప్పుకొచ్చారు. అంతేకాదు తిరుపతితో ఉన్న అనుబంధాన్ని రోజా ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. తిరుపతిలో పుట్టడం, పెరగడం, చదువు కోవడం.. సినిమాల్లో రాణించడం గర్వంగా ఉందన్నారు. ఇకపోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతో రాజకీయ రంగాల్లోనూ రాణిస్తు్న్నట్లు చెప్పుకొచ్చారు. స్వామి వారి ఆశీస్సులు, సీఎం జగన్ అండదండలతో మంత్రిగా పనిచేస్తున్నట్లు రోజా చెప్పుకొచ్చారు. ప్రజలకు మరింత సేవ చేసే, శత్రువులను ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలని భగవంతున్ని వేడుకున్నట్లు మంత్రి ఆర్‌కే రోజా మీడియాకు తెలిపారు.
వివాదంలో సింగర్ మంగ్లీ (Mangli Singer).. సోషల్ మీడియాలో ట్రోల్స్