Devaraలో మైడ్ బ్లోయింగ్ ట్విస్ట్.. మూవీలో NTR చనిపోతాడా?

by samatah |   ( Updated:2023-08-08 07:10:16.0  )
Devaraలో మైడ్ బ్లోయింగ్ ట్విస్ట్.. మూవీలో NTR చనిపోతాడా?
X

దిశ, వెబ్‌డెస్క్ : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీ ఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా దేవర. ఇక పాన్ ఇండియా లెవల్‌లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అదేమిటంటే? దేవర క్లైమాక్స్ పై ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. దేవరలో ఎన్టీఆర్ చనిపోతాడంట. చనిపోయాడు అనుకున్నదేవర ( ప్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎన్టీఆర్ రెండో పాత్ర ) క్లైమాక్స్ సీన్లో ఎంట్రీ ఇస్తాడని అలాగే ఈ క్లైమాక్స్ లోనే దేవర పాత్ర‌కు సంబంధించిన మిస్టరీ పాయింట్ కూడా రివిల్ అవుతుందని తెలుస్తోంది.

ఇక దేవర సీక్వెల్ లీడ్ కూడా ఈ క్లైమాక్స్ లోనే రివీల్ అవుతుందని ఈ సినిమా యూనిట్ ద్వారా లీకులు అయితే బయటకు వస్తున్నాయి. నిజంగా దేవర సినిమాకి సీక్వెల్ ఉంటుందా? రెండో పార్ట్‌లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తారా లేదా ? వేరే హీరో నటిస్తారా అన్నదానిపై కూడా కొరటాల ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Read More: Samantha ఆడుకుంటున్న ఆ పిల్లలు ఎవరో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed