పవన్ కళ్యాణ్ గురించి రేణు దేశాయ్ పోస్ట్.. పెళ్లాం ఎప్పుడైనా పెళ్లామే అంటూ..

by Sujitha Rachapalli |
పవన్ కళ్యాణ్ గురించి రేణు దేశాయ్ పోస్ట్.. పెళ్లాం ఎప్పుడైనా పెళ్లామే అంటూ..
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. జానసేనానిగా ఆయన ప్రభంజనం సృష్టించడాన్ని సెలబ్రేట్ చేసుకుంది. పిఠాపురం నుంచి పవన్ గెలవడం, పోటీ చేసిన అన్ని చోట్ల నుంచి జనసేన అభ్యర్థులు విజయం సాధించడంతో అకీరా, ఆద్య హ్యాపీగా ఉన్నట్లు పోస్టులు పెడుతూనే ఉంది. తను కూడా ఆయన సక్సెస్ పై హ్యాపీగా ఉన్నానని డైరెక్ట్ గానే చెప్పింది. ఎలాంటి బ్లేమ్ చేయకుండా పవన్ హ్యాపీనెస్ కోరుకున్నట్లు తెలిపింది. మరోవైపు అకీరాతో పాటు పవన్ మోడీని కలవడం.. ఆయనను పరిచయం చేయడంపై రేణు సంతోషపడుతూ పోస్ట్ పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

అయితే ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు మీమ్స్ క్రియేట్ చేసారు. వైఫ్ ఎప్పుడైనా వైఫే అనే అర్థం వచ్చేట్లు తయారు చేశారు. రేణు దేశాయ్ ను ట్యాగ్ కూడా చేశారు. దీంతో ఫీల్ అయిపోయిన ఆమె.. 'ఇలాంటి కామెంట్స్ చూడలేక డే వన్ నుంచి కామెంట్స్ సెక్షన్ ఆఫ్ చేశా. కానీ జనాలు నన్ను వదలడం లేదు. ఇలా మీమ్స్ చేసి బాధపెడుతున్నారు. నా ఎమోషన్స్ మీకు మీమ్స్ ఆయిపోయాయి. నాలాంటి పరిస్థితి మీకు ఎదురైతేనే నా బాధ ఏంటో తెలుస్తుంది ' అని పోస్ట్ పెట్టింది.

Advertisement

Next Story

Most Viewed