నిధులు కేటాయించిననంతరం నిర్మలా సీతారామన్‌పై వరుస మీమ్స్.. వైరలవుతోన్న ఫన్నీ పోస్ట్స్

by Anjali |
నిధులు కేటాయించిననంతరం నిర్మలా సీతారామన్‌పై వరుస మీమ్స్.. వైరలవుతోన్న ఫన్నీ పోస్ట్స్
X

దిశ, సినిమా: నేడు (జులై 23) పార్లమెంటులో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా లోక్‌సభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 11. 04 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. ఈ బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ మొత్తం రూ. 48. 21 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రతిపాదించింది. ‘ముద్రరుణాలు రూ. 20 లక్షలకు పెంపు, కొత్తగా 12 పారిశ్రామిక కారిడార్లు, కార్మికులకు డార్మిటరీ తరహా అద్దె ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేక సదుపాయాలు, మహిళాభివృద్ధికి రూ 3 లక్షల కోట్లు, పీఎం, సూర్య ఘర్ కింద 1. 8 కోట్ల రిజిస్ట్రేషన్లు, మౌళిక సదుపాయాల అభివృద్ధికి రూ. 11 . 11 లక్షల కోట్లు.. అలాగే బీహార్ రోడ్లకు 29 కోట్లు కేటాయించింది.

బడ్జెట్ ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతామన్ బీహార్ రోడ్లకు 29 కోట్లు కేటాయించించడంపై పలువురు నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేయడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండ్ బీహార్ హ్యాపీగా ఉన్నట్లు.. ఇతర రాష్ట్రాలు నిరాశకు గురవుతున్నట్లు మీమ్స్ సృష్టించి నెట్టింట వైరల్ చేస్తున్నారు. అలాగే టీడీపీ కార్యకర్తలు వింటేజ్ చంద్రబాబు నాయుడును చూడబోతున్నారంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed