హోటల్‌లో సెక్స్ వర్కర్లను టార్చర్ చేసిన దర్శకనిర్మాతలు.. వీడియో వైరల్

by Prasanna |   ( Updated:2023-01-23 06:04:58.0  )
హోటల్‌లో సెక్స్ వర్కర్లను టార్చర్ చేసిన దర్శకనిర్మాతలు.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : భారతీయ నిర్మాత రాజ్ గుప్తా, పాకిస్థానీ దర్శకుడు సయ్యద్ ఎహ్సాన్ అలీపై పాకిస్థానీ నటి మెహ్రీన్ షా సంచలన ఆరోపణలు చేసింది. అజర్‌బైజాన్‌లోని బాకులో ఓ సినిమా షూటింగ్ సమయంలో తనను లైంగికంగా వేధించారని చెప్పింది. అంతేకాదు తాను బస చేసిన హోటల్లో అర్ధరాత్రి తలుపు తట్టి శారీరకంగా సహకరించాలని టార్చర్ చేశారన్న ఆమె.. తాను ఒప్పుకోకపోవడంతో సెక్స్ వర్కర్లను తీసుకొచ్చి నానా హంగామా చేశారని చెబుతూ నెట్టింట ఓ వీడియోను పోస్ట్ చేసింది. 'ఆ భయానక క్షణాలు గుర్తొస్తే తట్టుకోలేను. సెక్స్ వర్కర్లను హోటల్‌కు తెచ్చుకుని అసభ్యంగా ప్రవర్తించారు. చివరికి కనీసం వాళ్లకు భోజనం కూడా పెట్టకుండానే పంపించేశారు. ఆ తర్వాత వాళ్ల అసభ్యకరమైన పనితీరు, డిమాండ్లను నేను అంగీకరించకపోవడంతో దారుణంగా వేధించారు. హోటల్లో నన్ను ఒంటరిగా వదిలేసి ఆకలితో అల్లాడిపోయేలా చేశారు. రెండు రోజులకు అనారోగ్యం పాలైన తర్వాత హోటల్ సిబ్బంది సహాయం అందించారు' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. చివరగా ఇలాంటి దుర్మార్గులతో నటీనటులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వాళ్లతో పనిచేసే మహిళలు అచితూచి వ్యవహరించాలని కోరింది.

Advertisement

Next Story