వేల అడుగుల ఎత్తులో విమానం నుంచి దూకిన నటి.. వీడియో వైరల్

by samatah |   ( Updated:2023-03-24 17:59:43.0  )
వేల అడుగుల ఎత్తులో విమానం నుంచి దూకిన నటి.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ మెహరీన్ ఫిర్జాదా ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ బిగ్ హిట్ సొంతం చేసుకోలేకపోయిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఆఫర్లు లేక ఖాళీగానే ఉంటోంది. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన ఆమె వివిధ ప్రాంతాలు తిరుగుతూ బీచుల్లో తెగ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు నెట్టింట పోస్ట్ చేస్తూ మురిసిపోతోంది. అంతేకాదు ట్రావెలింగ్‌లో ఎంతో మజా ఉంటుందనే పలు విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. రీసెంట్‌గా అండర్ వాటర్ డైవ్ చేసి ఆకట్టుకున్న మెహరీన్.. తాజాగా వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవ్ చేసి ఆశ్చర్య పరిచింది. అయితే ఈ స్కై డైవింగ్‌కి వెళ్లడానికి ముందు చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అవుతున్నట్లు వెల్లడించిన హనీ బేబి.. వేల అడుగులపైకి విమానంలో వెళ్లి, అక్కడి నుంచి స్కై డైవ్ చేయడం విశేషం. కాగా గాల్లో తేలుతూ ఎంజాయ్ చేయడం తన లైఫ్‌లో మరిచిపోలేనిదని,ఈ డైవ్‌‌కు ముందు హార్ట్ బీట్ పెరిగిపోయిందని ఆనందంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి : ఉదయ్ కిరణ్ మరణవార్త విని.. ఇండస్ట్రీని వదిలి వెళ్లిన స్టార్ హీరో?

Advertisement

Next Story