శారీలో మెరిసిపోతున్న Mehreen Pirzada.. లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటున్న నెటిజన్లు

by Kavitha |   ( Updated:2024-07-13 07:25:18.0  )
శారీలో మెరిసిపోతున్న Mehreen Pirzada.. లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ పిర్జాదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ భారీ హిట్ కావడంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దాంతో మహాను భావుడు, రాజా ది గ్రేట్, జవాన్, పంతం, అశ్వథామ, మంచి రోజులు వచ్చాయి, ఎఫ్3 వంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఏమైందో ఏమో గానీ కొన్ని రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా మెహ్రీన్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో బాటిల్ గ్రీన్ కలర్ చీర కట్టుకొని వయ్యారంగా ఫోటోలకి పొజులిచ్చింది. అంతే కాకుండా ‘తోబా తోబా’ అనే సాంగ్‌ క్యాప్షన్‌ని జోడించింది. అది చూసిన నెటిజన్లు కరెక్ట్‌గా సూట్ అయ్యే సాంగ్‌ని సెలెక్ట్ చేసుకున్నావ్ అని.. లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.

Advertisement

Next Story

Most Viewed