Megha Akash: ఖాళీ సమయంలో ఆ పని మాత్రమే చేస్తా.. హద్దులు మీరను

by Prasanna |
Megha Akash: ఖాళీ సమయంలో ఆ పని మాత్రమే చేస్తా.. హద్దులు మీరను
X

దిశ, సినిమా: సవాలుతో కూడిన పాత్రలు పోషించినపుడే తనలోని అత్యుత్తమ నటిని బయటకు తీసుకురాగలనంటోంది మేఘా ఆకాష్. అంతేకాదు ఏ విషయంలోనైనా అతిగా ఆశించడం తనకు నచ్చదని, ఒక నటిగా తన ప్రయాణంలో ఇప్పటివరకూ సంతృప్తిగానే ఉన్నానంటూ రీసెంట్‌ ఇంటర్వ్యూలో తన కెరీర్, పర్సనల్ విషయాల గురించి ఓపెన్ అయింది. ‘నేను నా ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. ఏ మాత్రం ఫ్రీ టైమ్ దొరికినా వాళ్లతోనే గడిపేస్తా. ఇక ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయాలనుకోను. నా ప్రతి చిత్రాన్ని మాములు ప్రేక్షకులలాగే ఆస్వాదిస్తా. విమర్శనాత్మక కోణంనుంచి చూడటం నాకు తెలియదు. సెట్‌లోనూ నేనెప్పుడూ మానిటర్ చూడను. అంతా అయిపోయాక ‘ఎలా చేశాను’ అని దర్శకుడినే అడిగి తెలుసుకుంటా. ఎల్లప్పుడూ నాకు నచ్చిన పాత్రలతోనే ప్రయాణించడాన్ని ఆస్వాదిస్తా. తెలుగులో అందరితో పనిచేయాలనుకుంటున్నా. పవన్‌తో నటించాలనేది నా డ్రీమ్’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

Advertisement

Next Story